నాటినుండి నేటివరకూ భౌతికవాదం పాలకవర్గాల కక్షకు గురౌతూనే ఉంది. ఇది మన దేశంలోనే గాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగింది. గ్రీకు భౌతికవాద తత్వవేత్త డెమాక్రిటస్ ప్రతిపాదించిన 'అణువాదం' ప్రభావాన్ని తట్టుకోలేక భావవాది అయిన ప్లేటో ఆ డెమాక్రిటస్ గ్రంథాల్ని తగులుబెట్టమని ఆదేశించాడు. తమ ప్రత్యర్థుల్ని తిట్టాలంటే ''వాడు నాస్తికుడు'' అన్న పదాన్ని చాలామంది ఉపయోగించారు. ''అధికారంలో వున్న పార్టీచేత 'వీరు కమ్యూనిస్టులు' అనే తిట్టుతినని ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా?'' అని కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్, ఎంగెల్స్ ప్రస్తావించారు.
మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు పట్టాభిషేకానికి తరలివస్తున్నాడు. బ్రాహ్మణులంతా ఎదురేగి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. స్తోత్రాలతో, ఆశీర్వచనాలతో వారంతా హడావుడిగా ఉండగా వారి మధ్యలో నుండి ఒకడు ముందుకొచ్చి ధర్మరాజుని ఇలా నిలవేశాడు. ''కేవలం నీ అధికారకోసం, రాజ్య కాంక్షకోసం ఇంత రక్తపాతం సృష్టించడం సబ బేనా? నీ రక్తబంధువుల్ని, అన్నదమ్ముల్ని సైతం తుదముట్టించడం న్యాయమేనా? యావత్ బ్రాహ్మణలోకం నిన్ను శపిస్తోంది. నువ్వు సిగ్గుతో చావాలి''. ఈ దెబ్బకి ధర్మరాజు దిగ్భ్రాంతుడ య్యాడు. చావుతప్ప తనకి వేరే దారి లేదనుకు న్నాడు. ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అప్పటికి తేరుకున్న తక్కిన బ్రాహ్మణులు ధర్మరాజుని వారించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపేశారు. ''నిన్ను ఈ విధంగా నిందించినవాడు చార్వాకు డనే రాక్షసుడు. నీ శత్రువైన దుర్యోధనుడికి స్నేహితుడు. మా బ్రాహ్మణ లోకానికీ వాడికీ ఏ సంబంధమూ లేదు. నీవంటే మాకెంతో అభి మానం ఉంది. వాడి సంగతి మేం చూసు కుం టాం'' అని చెప్పి మూకుమ్మడిగా చార్వా కుడిపై దాడి చేసి సజీవంగా తగలబెట్టి చంపుతారు.
ప్రాచీన భారతీయ భౌతికవాదాన్ని ఒక దుర్మార్గమైన తత్వశాస్త్రంగా చిత్రీకరించడానికి పూనుకున్న భావవాదులు చార్వాకుడి పేరును అందుకు ఉపయోగించారు. ''దుర్మార్గుడైన దుర్యో ధనుడికి గల ఇంకొ దుర్మార్గుడైన స్నేహితుడు చార్వాకుడనే పేరుగల రాక్షసుడు. అలాంటి రాక్షసులు చెప్పే సిద్ధాంతం భౌతికవాదం. కనుక ఆ సిద్ధాంతం కూడా దుర్మార్గమైనది'' అంటూ దుమ్మెత్తి పోయడానికి పూనుకున్నారు. వారు ఆ రాక్షసుడి పేరుతోనే ఈ భౌతికవాదాన్ని గురిం చి ప్రస్తావించారు. తిట్టారు. ఆడిపోసుకున్నారు.
పోనీ వాళ్లు చెప్పిన దాని ప్రకారమే చూసి నా చార్వాకుడు అన్న మాటల్లో పొరపాటే ముంది? ''అధికార కాంక్షతో రక్తపాతం సృష్టించ డం తప్పు అన్నాడు. ఇందులో మానవత్వం, నిస్వార్థం కనపడుతున్నాయే తప్ప దుర్మార్గం, అధర్మం ఏముంది? అలా విమర్శించిన చార్వా కుడిని సజీవంగా తగులబెట్టిన బ్రాహ్మణులు ప్రదర్శించినది రాక్షసత్వం. అంతే తప్ప చార్వా కుడు రాక్షసుడని ఎలా అనగలుగుతాం? అదే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే ముందు, స్వంత అన్నదమ్ములనూ, రక్త సంబంధీకులనూ, పెద్దలనూ, గురువులనూ చంపడం ధర్మమేనా అన్న అర్జునుడి సందేహాన్ని తీర్చడానికి కృష్ణుడు ఏం చెప్పాడు? విశ్వరూపం ప్రదర్శించి అన్నదమ్ములులేరు, ఎవరూ లేరు అంతా నేనే, అన్నీ నేనే అని చెప్పాడు. అంతటితో ఆగక ఈ యుద్ధంలో పోరాడి మరణిస్తే వీర స్వర్గం దక్కుతుంది. అక్కడ సకలసుఖాలూ దక్కు తాయి. లేదా గెలిస్తే రాజ్యసుఖం దక్కుతుంది అని చెప్పాడు. అంటే అర్జునిడిలో స్వార్థాన్నీ, రాజ్యకాంక్షని రేకెత్తించాడు. కృష్ణుడు చెప్పిన దానికన్నా రాక్షస చార్వాకుడు తిట్టిన తిట్లలోనే ఎక్కువ మానవత్వం కనపడుతోంది కదా.
ఇంత కథ ఎందుకవసరమైందంటే ప్రాచీన భారతీయ భౌతికవాదానికి పేరు సైతం లేకుం డా పాలకవర్గాలు నాశనం చేసి పారెయ్యాలని ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఆ భౌతికవా దాన్ని రూపొందించిన వారి గ్రంథాలూ, రచన లూ సర్వం నాశనం చేయబడ్డాయి. అయినా పాలకవర్గ భావవాదులు ఊరుకోలేదు. తమ గ్రంథాల్లో, రచనల్లో బౌతికవాదుల్ని దుమ్మెత్తి పోశారు. ఆడిపోసుకున్నారు. భౌతికవాదులు చెప్పినదాన్ని వక్రీకరించి ప్రచారం చేశారు. అదిగో అలా ప్రచారం చేయడమే మనకు అక్కర కొచ్చింది.
''వీళ్లు ఇలా తిట్టారు గనుక వాళ్లు అలా చెప్పివుంటారు'' అని అనుకోడానికి అవకా శం వచ్చింది. ఈ శత్రువుల దుష్ప్రచారాలే మనకి ఆధారంగా మిగిలాయి. లేకుంటే మనకు ఇంత విశిష్టమైన స్థాయిగల భౌతికవాదం వారస త్వంగా ఉందని తెలుసుకునే అవకాశమే లేకుండా పోయేది. ''ప్రాచీన భారతీయ భౌతిక వాదానికి మూడు పేర్లు వాడుకలో ఉన్నాయి. ఒకటి చార్వా కం. అదొక రాక్షసుడి పేరని ముందే చెప్పుకు న్నాం. మరొకటి లోకాయతం, మూడవది బ్రాహ స్పత్యం. ''లోకేషు ఆయతః ఇతి లోకాయతమ్'' అన్నారు. లోకుల్లో బాగా ప్రాచుర్యం పొందింది గనుక లోకాయతం అన్నారు. ఈ నిర్వచనం బాగానే ఉందిగదా. మంచిపేరేగదా అనుకో వచ్చు. కాని ఈ పేరూ శత్రువులు పెట్టిందే. శత్రువులెవరైనా మంచి పేరు పెడతారా? ఛస్తే పెట్టరు. మరెందుకిలా జరిగింది? అంటే శత్రువులు కసితోటే దీనిని లోకాయతం అన్నారు. ఇక్కడ లోకులంటే ఎవరు! అన్నది చూడాలి. పాలకవర్గ పండితుల దృష్టిలో లోకులు అంటే చదువు, సంధ్యాలేని, అనాగరికులైన అథమ జాతులకు చెందిన వారు అని అర్థం. ఇప్పటి భాషలో కొందరు ''పెద్ద మనుషులు'' సామాన్య ప్రజల్ని మందలు అని, అలగా జనం అని, ఇంగ్లీషులో మాబ్, మాస్ అని హేళనగా అన్నట్టే ఆనాటి పండితులు సామాన్య ప్రజల్ని లోకులు అని, లోకాయతం అంటే అటువంటి అజ్ఞానుల్లో ప్రచారం పొందిన పనికిమాలిన సిద్ధాంతం అని నిందాపూర్వకంగా అవహేళన చేసేరు.
సాంప్రదాయకంగా అగ్రవర్ణాలకు మాత్ర మే చదువుకునే హక్కు ఉన్న భారతదేశంలో మెజారిటీ ప్రజానీకాన్ని అక్షరజ్ఞానానికి దూరంగా నెట్టివేశారు. అటువంటి అత్యధిక సంఖ్యాకుల్లో లోకాయతం ప్రచారం పొందిందని పాలకవర్గ మే తన తిట్లలో తెలియకుండానే ఒప్పుకోవలసి వచ్చింది. సామాన్య ప్రజలకోసం ప్రాచీన భార తీయ భౌతికవాదం నిలబడింది అని చెప్పకనే చెప్పినట్లయింది.
ఇంతకూ మన ''పండితులు'' లోకాయతం ప్రాచుర్యానికి కారణమేమిటని చెప్పారు? లోకా యతులు ఈ లోకంలోని భౌతిక సుఖాలకే ప్రాధా న్యతనిస్తారనీ, సంపాదన, అధికారాన్ని పొంద డమే పరమార్థమని చెప్తారనీ, పరలోకమంటూ ఏదీ లేదంటారనీ, 'లోకులకు' అంటే సామాన్య జనానికి కూడా (పరలోకం గొడవకన్నా) ఇటు వంటి మాటలు చెప్తేనే వినడం ఇష్టమనీ కనుక వీరి వాదం లోకాయతం ఐందని మాధవుడు తన సర్వదర్శన సంగ్రహం అన్న గ్రంథంలో చెప్పారు.
దీనిని బట్టి రెండు విషయాలు స్పష్టం అవు తున్నాయి. మొదటిది, మన ప్రాచీన భౌతిక వాదులు 'పరలోకం' భావనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. రెండవది, లోకులకు (సామాన్య ప్రజలకు) సంపద, అధికారం కావాలన్నారు. అంటే సంపదను సృష్టించిన సామాన్య ప్రజలకే ఆ సంపదను అనుభవించే హక్కు ఉండాలని, ఆ సామాన్యులకే రాజ్యాధికారం దక్కాలని వారు ప్రచారం చేశారన్న మాట, ఒక విధంగా మాధవుడికి మనం ధన్వవాదాలు చెప్పాలి. ఎంతో కసితో అతడు ప్రాచీన భౌతివవాదుల్ని తిట్టిపోసినా ఆ కోపంలోనైనా నిజాన్ని అంగీక రించాల్సి వచ్చింది.
ఇదీ లోకాయతం అన్న పేరు వెనుక ఉన్న అసలు కథ. ఇక మూడోది: బ్రాహస్పత్యం, అంటే బృహ స్పతి రూపందించినది అని అర్థం. తెలివైన వాడిని, మేధావిని ''అతగాడు బుద్ధికి బృహస్పతి'' అంటారు. ఈ బృహస్పతి ఎవరు? పురాణాల్లో దేవతలకు గురువు. దేవతలేమో మన పాలక వర్గం. మరి వారికి గురువైనవాడు వారికే వ్యతిరే కంగా ఉండే భౌతిక వాదాన్ని ప్రతిపాదించడం ఏమిటి? అంతటి మేధావి ప్రతిపాదించినది అని చెప్పడమంటే దాని విశిష్టతను, గొప్పదనాన్ని అంగీకరించనట్టే గదా? అని ప్రశ్నించవచ్చు. మన పాలకవర్గ పండితులు మరీ అంత తెలివి తక్కువ వాళ్లేమీకాదు.
పూర్వకాలంలో దేవతలకూ, రాక్షసులకూ మధ్య ఎడతెగని యుద్ధాలు స్వర్గాధిపత్యం కోసం జరుగుతుండేవి. పలుమార్లు రాక్షసులది పైచేయి అయింది. శాశ్వతంగా ఈ రాక్షసులని దెబ్బ తీయడం ఎలా? అందుకు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించాడు. తానే మారు వేషంలో రాక్షసుల మధ్య ప్రవేశించి వారికి భౌతికవా దాన్ని బోధించాడు. ఆ రాక్షసులు తెలివి తక్కువ వాళ్లు గనుక ఆ వుచ్చులో పడ్డారు. భౌతిక సుఖాలమీదే ఎక్కువ దృష్టి పెట్టారు. దాంతో స్వర్గాధిపత్యంకోసం జరిగే పోరులో రాక్షసులు వెనకపడ్డారు. దేవతలు సునాయాసంగా విజయం సాధించారు. అలా శత్రువులకు మాయోపాయం తో బృహస్పతి బుద్ధిపూర్వకంగా చెప్పిన పనికిమా లిన సిద్ధాంతమే బ్రాహస్పత్యం. ఇదీ కథ. ఇది విష్ణుపురాణంలో పేర్కొన్న గాథ.
''భౌతికవాదాన్ని గనుక మీరు స్వీకరిస్తే మీరు కూడా రాక్షసుల మాదిరిగా దెబ్బతినిపో గలరు జాగ్రత్త'' అని ప్రజలను బెదరగొట్టడానికి 'బ్రాహస్పత్యం' అన్న పేరుతో భౌతికవాదంపై నిందాప్రచారం చేశారు.
భౌతిక అవసరాలకు మన ప్రాచీన భౌతిక వాదులు సముచిత ప్రాధాన్యతనిచ్చారని ఈ పురాణ గాథలను బట్టి అర్థం అవుతోంది. పాలక వర్గాలు 'పరలోక' ప్రచారంతో మభ్యపెట్టాలని చూస్తుంటే వారికి భౌతిక వాదులు అడ్డు తగిలారనీ, అందుకే పాలకపక్షాలు కక్షతో రగిలిపోయారనీ అర్థం అవువుతుంది. అందు వల్లనే పాలకపక్షాలు భౌతికవాద గ్రంథాలనేగాక భౌతికవాదులను కూడా (చార్వాకుని మాదిరిగా) తగల బెట్టారు.ఈ విధంగా ప్రాచీన భారతీయ భౌతిక వాదానికి చార్వాకం, లోకాయతం, బ్రాహస్ప త్యం అన్న మూడు పేర్లను పాలకవర్గాలే పెట్టా యి. వీటిలో ''ప్రజల్లో బాగా ప్రచారం పొంది నది'' అన్న అర్థం ఇచ్చే లోకాయతాన్నే ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఆనాటినుండి ఈ నాటివరకూ కూడా భౌతికవాదం పాలకవర్గాల కక్షకు గురవుతూనే ఉంది. ఇది మన దేశంలోనే గాదు, ప్రపంచం లో చాలా దేశాల్లో జరిగిందే. గ్రీకు భౌతికవాద తత్వవేత్త డెమాక్రిటస్ ప్రతిపాదించిన ''అణువా దం'' ప్రభావాన్ని తట్టుకోలేక భావవాది అయిన ప్లేటో ఆ డెమాక్రిటస్ గ్రంథాల్ని తగులుబెట్టమని ఆదేశించాడు. తమ ప్రత్యర్థుల్ని తిట్టాలంటే ''వాడు నాస్తికుడు'' అన్న పదాన్ని చాలామంది ఉపయోగించారు. ''అధికారంలో వున్న పార్టీచేత 'వీరు కమ్యూనిస్టులు' అనే తిట్టుతినని ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా?'' అని కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్, ఎంగెల్స్ ప్రస్తావించారు. దాదాపు రెండో ప్రపంచ యుద్ధం వరకు ''కమ్యూ నిస్టు'' అన్నది పెద్ద తిట్టుగా పాలకవర్గాలు ఉపయోగించాయి. ఇప్పటికీ అమెరికాలో ''కమ్యూనిస్టు'' అంటే ఏవగింపుగానే చూసే పరిస్థితిని పాలకవర్గాలు కొనసాగిస్తున్నాయి.
పాలకవర్గాలకూ, సామాన్య ప్రజలకూ మద్య జరుగుతూ వస్తున్న పోరాటంలో భౌతిక వాదం ప్రజల తరపున నిలిచే తాత్విక ఆయుధం కనుక లోకాయతానికి మనమే వారసులం. లోకాయతం ప్రతిపాదించిన తాత్విక వాద నలేమిటో తరువాత ముచ్చటిద్దాం
article by cpim.org
Thursday, July 16, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment